6 July, 2026 | 2:24 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మంథని గోదావరినదిలో స్నానానికి వెళ్లి యువకుడి గల్లంతు

04-11-2025 12:00 AM

వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించి, కుటుంబ సభ్యులకు తో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని నవంబర్ 3 (విజయ క్రాంతి) మంథని పట్టణంలోని మర్రివాడకు చెందిన రవికంటి సాయి (30) అనే యువకుడు సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మాచారం అందుకున్న వెంటనే మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మంథని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన రవికంటి సాయి ఆచూకీ కోసం గోదావరినదిలో తీవ్రంగా శోధిస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు.