పకడ్బందీగా ప్రజపాలన ప్రగతి ప్రణాళిక
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): ప్రజపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు. గురువారం అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు), మున్సిపల్ కమిషనర్లతో ప్రజపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణను వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిందిగా సూచించారు. ఈ 99 రోజుల కార్యక్రమం ప్రధానంగా 10 అంశాలపై కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డెవిడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.




