16 June, 2026 | 6:27 PM

పెద్దమ్మగుడి నూతన ఈఓగా ఎ.విజయకుమార్

16-06-2026 04:48 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ లోని జగన్నాధపురం పెద్దమ్మ గుడి నూతన ఈవో గా ఏ విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.  దేవాదాయశాఖ, హైద్రాబాద్ వారి,ఉత్తర్వుల ప్రకారం శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్ సందు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించుచున్న, అద్దెంకి విజయ్కుమార్  పదన్నోతిపై మంగళవారం రోజున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) సందు కార్యనిర్వహణాధికారి, గ్రేడ్-1 గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆలయ అర్చకులు మరియు సిబ్బంది స్వాగతం పలికి దేవాలయంలో పూజలు జరిపిన పిదప,అర్చకులు నూతన కార్యనిర్వహణాధికారి  ఎ.విజయ్కుమార్ కు వేదాశీర్వచనం గావించారు.