5 May, 2026 | 3:51 AM

గోదారి గట్టుపైన అందరూ సమానంగా ఆదరించే కథ

05-05-2026 02:48 AM

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరులతో చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే.. “-యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ కథను కోరుకున్నా. అలాం టి కథ ఈ సినిమాతో కుదిరింది. ఇది నా సినిమా నిర్మాణ ప్రయాణం. టఫ్‌గా ఉంది. ఏ పరిశ్రమ అయినా టఫ్ ఉంటేనే బాగుంటుంది. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేది కావడంతో నేను సూచించిన ఈ టైటిల్‌నే డైరెక్టర్ ఫైనల్ చేశారు. నటుడు ఛాలెంజ్ ఉన్న పాత్ర చేయాలనుకుంటాడు. సుమంత్ ప్రభాస్ గోదారి యాసను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.

ఈ సినిమాను అందరూ సమానంగా ఆదరిస్తారు. డైరెక్టర్ సుభాష్ కథలో భావోద్వేగాలు రాసిన విధానం, తీసిన విధానం చాలా పెక్యులర్‌గా ఉంటాయి. నాకు ప్రతిదీ పేపర్ మీద ఉండాలి. ఆయన ప్రతి విషయాన్ని ఫ్రేమ్‌తో సహా పేపర్ మీద చూపిం చారు. సునీల్ నారంగ్ నాకు శ్రేయోభిలాషి, మార్గదర్శి. ఈ సినిమాను సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్, నైజాంలో నేనూ, సునీల్, ఆంధ్రలో సురేశ్‌బాబు రిలీజ్ చేస్తు న్నాం. 7న సాయం త్రం ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. థియేటర్‌లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథలతో సినిమాలు  తీయాలనుకుంటున్నా. దీని తర్వాత -సుభాష్‌తోనే మరో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.