18 March, 2026 | 4:50 PM

మంచినీటి సమస్యకు పరిష్కారం

17-03-2026 12:00 AM

మొయినాబాద్ మార్చి 16 (విజయ క్రాంతి) : మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ 10వ వార్డులో ప్రజల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గత కొన్ని రోజులుగా వార్డులో ఉన్న బోరు మోటారుకు సోమవారం కౌన్సిలర్ పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ చొరవతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. వార్డులో మంచినీటి ఎద్దడిని గమనించిన కౌన్సిలర్ పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ వార్డు ప్రజలతో కలిసి స్వయంగా పర్యవేక్షించి మొరాయించిన మోటార్ కు  మరమ్మతులు చేయించారు.

అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఎన్నో రోజుల నుండి చెడిపోయిన బోరు మోటర్ ను బాగు చేయించి తమకు నీటి సౌకర్యం కల్పించినందుకు వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వార్డు కౌన్సిలర్ గా పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ముత్యాల పుష్పమ్మ, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.