12 May, 2026 | 11:42 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

శ్రీ రామలింగేశ్వర స్వామివారికి వెండి కానుక

27-02-2026 12:00 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్పలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఘనపూర్ గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధరచారి చంద్రిక దంపతులు (లలిత జ్యూవెలర్స్) తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 371 గ్రాముల బరువున్న వెండి శివలింగాన్ని కానుకగా అందజేశారు. దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.