10 May, 2026 | 2:46 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

పర్మినెంట్ కార్యదర్శిని నియమించాలి

14-02-2026 12:49 AM

మోతె, ఫిబ్రవరి 13: మండల కేంద్రమైన మోతె గ్రామానికి పర్మినెంట్ గ్రామ కార్యదర్శిని నియమించాలని కోరుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉపసర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డిలు యం పి డి ఓ ఆంజనేయులు కు  వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డిలు మాట్లాడుతూ మండల కేంద్రంలో పర్మినెంట్ కార్యదర్శి ని ఏర్పాటు చేయాలని  గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇంచార్జీ కార్యదర్శితో ఇబ్బందులు పడుతున్నామని పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే గ్రామ కార్యదర్శిని నియమించి గ్రామ పరిపాలన కు ఆటంకం లేకుండా చూడాలని యం పి డి ఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు వీరబాబు, తరుణ్, నవీన్, రమేష్, యశోద, భద్రమ్మ  తదితరులు పాల్గొన్నారు.