19 August, 2026 | 2:33 AM

దొరికిందా మొదలైంది!

19-08-2026 12:00 AM

హరిహరన్, శ్రీలేఖ, సుహానా హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న కొత్త సినిమా ‘దొరికిందా’. వీటీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై సడ్లపల్లి వెంకటేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తుండగా, షోయబ్ డీవోపీగా పనిచేస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి క్లాప్ కొట్టగా, టాలీవుడ్ నిర్మాత అశోక్‌కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో నిర్మాత పద్మిని నాగులపల్లి స్క్రిప్‌ను చిత్రబృందానికి అందించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకటేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “మా ‘దొరికిందా’ మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలొ పాత కొత్త నటీనటులు నటించనున్నారు” అన్నారు.