29 July, 2026 | 11:19 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

జన్మంతా అమ్మ

11-05-2026 12:08 AM

సూర్యుని తొలి వెలుగు కన్నా 

అమ్మ లేత వెలుగే 

చల్లగా ఇంటిని నిద్ర లేపుతది 

ఇంటి పాచినంత తన చెమటతో 

కడిగేసి అద్దంలా 

మెరిపింపజేస్తుంది

వంట గిన్నెలపై అమ్మ హస్తరేఖల 

ఆనవాళ్లు అరిగిపోతూ 

తళ తళ మెరుస్తాయి 

పిల్లల బట్టలపై ఇస్త్రీ అయి 

అమ్మ చేయి మురిసిపోతది.


వంటింట్లో పొయ్యికాడ 

మసలిపోతూ

ఉడుకుడుకు బువ్వ పెట్టి 

నీ కడుపు నింపుతది

నువ్వు తిన్న తర్వాత 

బాగుంది అనే మాట 

కోసం వేచి చూస్తుంది

అమ్మ కంటి రెప్పల కిందే ఇల్లు 

నిద్రపోతది

అమ్మ గుండె శబ్దంతోనే 

అందరి గుండెలు పలుకుతాయి 

ఒక చెట్టు పలకరింపులా !

అమ్మ మనసు ఆకాశమంత 

ఎప్పటికీ ఒడవని కథ ‘అమ్మ’ !!