19 August, 2026 | 4:41 AM

బర్త్ డేకు మెగా అప్‌డేట్!

19-08-2026 12:00 AM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రెండో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మెగా158’, ‘చిరు అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్ష న్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుండటంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 రోజులు పూర్తి చేసుకుంది.

ఇంత తక్కువ సమయంలో ఇంత కీలకమైన ప్రగతి సాధించడం సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో స్పష్టమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, ఇప్పటివరకు తీసిన ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని టీమ్ పేర్కొంది. ఇటీవల షూట్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు మరో ప్రధాన హైలైట్‌గా నిలవనుందని తెలిపింది. భారీ స్థాయిలో డిజైన్ చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ బ్లాక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండబోతోందని టీమ్ చెబుతోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ నిదానంగా కొనసాగుతుండటంతో పాటు ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా దాదాపు పూర్తవ్వడంతో ప్రొడక్షన్ నెక్స్ ఫేజ్‌లోకి వెళ్తోంది.  ఇదిలావుండగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ అప్డేట్ ఇచ్చేందుకు ఈ చిత్ర నిర్మాతలు సిదమవుతున్నారు. ఈ స్పెషల్ అప్డేట్ కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌గా, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.