26 April, 2026 | 1:37 AM

మహాక్షేత్రం.. మట్టపల్లి

26-04-2026 12:11 AM

నేటి నుంచి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలు ప్రారంభం

శ్రీలక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన మట్టపల్లి దేవాలయం మహాక్షేత్రంగా వెలుగొందుతోంది. కృష్ణాతీర పంచ నారసింహ క్షేత్రాల్లో ఇది ప్రధా నమైనది. ఇది రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధికెక్కింది. 11వ శతాబ్దంలో దైవం దర్శనమిచ్చి, స్వామి ఆజ్ఞమేరకు దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా మహాక్షేత్రంగా విరాసిజిల్ల్లు తోంది. కృష్ణా ప్రవాహంతో ఇబ్బందులు కలకుండా కరకట్టలు నిర్మించారు.

స్వామికి 32 ప్రదక్షిణలు చేసి కొలుస్తే.. కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. యమధర్మరాజు ప్రదక్షిణలు చేసిన క్షేత్రంగా కూడా పేరుగాంచింది. ఇక్కడ మూడు రోజులపాటు స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే నేడు ఆరాధనోత్సవాలు ప్రారం భం అవుతుండడంతో మట్టపల్లి మహాక్షేత్రంపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.

లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణలో లెక్కకు మించి ఉన్నాయి. ఆయన కొలువై ఉన్న ఆలయాల్లో దేని ప్రాశస్త్యం దానిదే. ప్రతిదీ ఓ ప్రత్యేకమైనదే. వాటిలో కృష్ణానదీ తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలు మంగళగిరి, వేదాద్రి, కేతవరం, వాడపల్లి, మట్టపల్లి ఉన్నాయి. వీటిలో మట్టపల్లి దేవాలయం రెండో యాదగిరిగుట్టగా పేరొందింది. ఇక్కడ చెంచులక్ష్మితాయర్, రాజ్యలక్ష్మితాయర్, ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మి నరసింహస్వామి ప్రధాన దైవం. వెండితో చేసిన కవచం, మీసాలు కలిగి ఉంటాడు.

ఇదీ చరిత్ర: 11వ శతాబ్దంలో కృష్ణానదికి ఆవలి వైపున గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతా న్ని అనుముల మాచిరెడ్డి అనే ప్రభువు పరిపాలించేవాడు. ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో చక్రములు, గద, అభయము ద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో, తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో, దివ్య దర్శనమిచ్చాడు స్వామి. మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయంవ్యక్తంగా ఉన్నాను’ అని చెప్పాడు.

వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయారు. దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టుకింద పడుకొని, నిద్రించాడు. కలలో ‘నిన్ను కనిపెట్టలేని బతుకు వృథా! ఇక్కడే తనువు చాలిస్తా’అని మాచిరెడ్డి చెప్పగా, స్వామి కరుణించి, ‘ఎదురుగా ఆరె చెట్టుపై ఉన్న గరుడపక్షి, ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని’ చెప్పా డు. నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి, గరుడపక్షి వాలిన చోట గుహను తొలగించగా అందులో లక్ష్మీనరసింహస్వామి కనిపించాడు.

తదుపరి స్వామిని సామాన్య ప్రజలు కూడా సేవించుకోవడానికి వీలుగా స్వామికి ప్రతి నిత్యమూ సకల సేవలూ జరపటానికీ అన్ని ఏర్పాట్లూ చెయ్యటమేగాక, ముఖ మంటపాన్ని కూడా నిర్మింపచేసి, ఆలయా భివృద్ధికి కృషి చేశాడు. అప్పటినుంచి దేవాలయం అంచలంచెలుగా అభివృద్ధిచెందుతూ..ఇప్పుడు మహాక్షేత్రంగా విరాజిల్లుతోంది. అయి తే ఈనెల 29 నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు జరిగే స్వామివారి తిరుకళ్యాణోత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 

నిర్మాణ విశేషాలు..

ముఖమండపం ఇరవై ఒక్క స్తంభాలతో కూడి ఉంది. సిమెంటుతో చేసిన పైకప్పు కూడా ఉంది. ఉత్తర ద్వారం ముం దు ఐదు దూలాలు, సిమెంటుతో కూడిన మంటపాన్ని చూడవచ్చు. స్వామికి ఎదురుగా హనుమంతుని విగ్రహం ఉంది. పులిచింతల ప్రాజెక్టు నీరు దేవాలయంలోకి రాకుండా ఉండ డం కోసం శివాలయం, అన్నదాన సత్రాల రక్షణ కోసం ఆల యం చుట్టూ రూ.2 కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్ వరకు రూ.4 కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం కరకట్టలు నిర్మించింది.

ప్రదక్షిణలు ఇలా: 

భక్తులు కృష్ణానదిలో స్నానంచేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరె చెట్టు, ధ్వజ స్తంభం, ఆంజ నేయస్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు. ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, ఆ కోరిక తీరిన తరువాత మళ్లీ వచ్చి 32 ప్రదక్షిణలు చేస్తారు.       

యమధర్మరాజు ప్రదక్షిణలు చేసిన క్షేత్రం!

ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు. సాధారణంగా విష్ణుమూర్తికి తులసీ దళములు ప్రీతికరమైనా, ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరె పత్రినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు వల్లనే కదా స్వామి ఉనికి తెలిసింది!

నాడు మహర్షులకు.. నేడు సామాన్యులకు దర్శనం

గుహ బయల్పడక ముందు భరద్వాజాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని, ఇప్పటికీ కొంతమంది మహర్షులు సూక్ష్మరూపంలో స్వామివారిని దర్శించుకుంటారని స్థల పురాణం చెబుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో గుహకు ఉత్తరం వైపు మరో ద్వారం ఏర్పాటు చేశారు. స్వామివారికి ఆరెపత్రితో పూజలు నిర్వహిస్తారు. అన్ని ప్రధాన హిందూ పండుగలనూ ఈ దేవాలయంలో నిర్వహిస్తారు. 

అన్నాలయ్యగా స్వామికి పేరు

ఇక్కడ భక్తులకు మధ్యాహ్నం, రాత్రి అన్నదానం ఉచితంగా చేస్తారు. సుమారు 11వ శతాబ్దం నుంచి వివిధ సామాజిక వర్గాల కోసం 19 అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తద్వారా ఇక్కడి స్వామి వారిని అన్నాలయ్యగా పిలవడం జరుగుతోంది. ఇక్కడి స్నాన ఘట్టాలను ప్రహ్లాద స్నాన ఘట్టం, మార్కండేయ స్నాన ఘట్టం, బాలాజీ స్నాన ఘట్టాలు ఉన్నాయి. స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్ల ద్వార వెళ్లే భక్తులు.. మెట్ల పూజ చేస్తారు. పసుపు కుంకుమలు అద్దుతూ అధిరోహిస్తారు.

 నట్టె కోటేశ్వర్‌రావు, విజయక్రాంతి, సూర్యాపేట

మూడు రోజులు ఉత్సవాలు 

ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో మూడురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ జరిగే నిత్యకల్యాణ కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత కళ్యాణ తంతు నిర్వహిస్తారు. 

చాలా ప్రాశస్త్యం గల దైవాలయం

శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాశస్త్యం కలది. దేవుని మీద నమ్మకంతో వివి ధ రాష్ట్రాల నుంచి భక్తు లు ఇక్కడికి వచ్చి దైవదర్శనం చేసుకుంటారు. స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేటి నుంచి అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈనెల 29 తారీకున ధ్వజా రోహణం, 30 రాత్రి స్వామి వారి తిరుకల్యాణం, మే 1న గరుడ సేవ, 2న హంసవాహన, 3న పలు రకాల సేవలతోపాటు, వాహన సేవ, 4న స్వామి వారి ద్వాద శ ప్రదక్షిణాలు, పవళింపు సేవతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

 పద్మనాభాచార్యులు,

ముఖ్య అర్చకులు,

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం,

మట్టపల్లి