11 July, 2026 | 2:09 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

వైభవంగా సత్యసాయి ప్రేమ వాహిని రథ యాత్ర

02-02-2026 12:00 AM

ప్రేమవాహిని రథనికి బెజ్జంకిలో ఘన స్వాగతం

బెజ్జంకి, ఫిబ్రవరి 1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి (శతజ యంతి) ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర దేశవ్యాప్తంగా సాగుతోంది.జయంతి లో భా గంగా  శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఆదివారం బెజ్జంకి చేరుకోవటం జరి గింది. సత్యసాయి భక్తులు భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతిలతో ఘనస్వాగతం పలికారు.మండలి సభ్యులు మాట్లాడుతూ శ్రీసత్యసాయి భగవానుని దివ్య వైభవాన్ని చాటుతూ పుట్టపర్తి నుండి బయలు దేరిన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం బెజ్జంకి చేరి గ్రామ వీధుల గుం డా తిరుగుచూ ప్రాంతాన్ని పావనం చేయ టం జరిగిందని తెలిపారు.

సత్యసాయి సేవా నిర్వాహకులు, విద్యార్థులు, భక్తులు వివిధ భక్తి ప్రదర్శన చేశారు. నృత్యాలు భజనలతో సందడి వాతావరణం నెలకొంది. దేవతామూర్తుల వేషధారణలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి సేవ సమితి బాధ్యులు,సర్పంచ్ శ్రీధర్,సుదర్శన్ రెడ్డి ,మోహన్ ,వివిధ హిందూ సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.