2 July, 2026 | 3:28 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఘనంగా బ్రిలియంట్ కళాశాలలో వీడ్కోలు సభ

13-02-2026 12:00 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): స్థానిక సారపాక లో గల బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు.గురువారం కళాశాలలో జరిగిన వీడ్కోలు సభలో సీనియర్, జూనియర్ విద్యార్థులు సరదా గడిపారు.మొదటిగా వందేమాతరం గీతం ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ ఏజెన్సీలో సూదుర ప్రాంతాలకు వెళ్లలేక పోయిన మాలాంటి వాళ్ళకోసం బ్రిలియంట్ కాలేజ్ స్థాపించి స్టేట్ ర్యాంకులతో నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా మాలోని నైపున్యాలను గుర్తించి మమ్ము అన్నివిధాలుగా ప్రోత్సహించి మాపై మాకు ఎంతో నమ్మకాన్ని కలిగించిన చైర్మన్ బిఎన్‌ఆర్ కు కృతజ్ఞతలను తెలియ జేశారు. అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ మాట్లాడుతూ ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు టాప్ కాలేజ్ లలో, యూనివర్సిటీలలో చదివి అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారన్నారు. 

బ్రిలియంట్ విద్యాసంస్థలు ఎప్పుడు వెన్నంటూ ఉంటుందని తెలిపారు. కాలేజ్ పూర్తి అయి వెళ్తున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులందరు డాక్టర్ బి.ఎన్.ఆర్ ను ఘనంగా సత్కరించారు. హెడ్మిసెస్ స్వర్ణకుమారి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.