18 July, 2026 | 12:30 AM

వార్డెన్లు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి

18-07-2026 12:15 AM

వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమం వారి భవిష్యత్తే తొలి ప్రాధాన్యం

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్, జూలై 17: వసతి గృహాల్లో వి ద్యార్థుల సంక్షేమం వారి భవిష్యత్తే తొలి ప్రా ధాన్యం ఇస్తూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు వంద శాతం ఫలితాలపై దృష్టి పెట్టడ మే కాకుండా వార్డెన్లు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీ త లక్ష్మారెడ్డి వార్డెన్లకు సూచించారు.

విద్యార్థుల సంక్షేమంతో పాటు విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించి, వంద శా తం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఆ మె పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నర్సాపూర్ నియోజకవర్గ స్థా యి ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తూప్రాన్ ఏ ఎస్సీడబ్ల్యూఓ శేషాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ పాల్గొన్నారు.

నియోజక వర్గంలో 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే, హాస్టళ్లలో ప్ర వేశాల సంఖ్య పెంచడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పదో త రగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వార్డెన్లు, ఉపాధ్యాయు లు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కొల్చారం, గోమారం, హత్నూర నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన భోజనం, కాస్మోటిక్ ఛార్జీలు, దుస్తులు, బెడ్షీట్లు, నోట్బుక్స్ తదితర సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే త న దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్తో చర్చించి చర్యలు తీ సుకుంటానని తెలిపారు.ఈ సమావేశంలో ఏఎస్సీడబ్ల్యూఓ శేషాచారి, ఏబీసీడబ్ల్యూఓ గంగాకిషన్, ఏఎస్సీడబ్ల్యూఓ పద్మజ, ఏబీసీడీఓ అమరజ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈఓ తారాసింగ్, నియోజకవర్గంలోని హాస్టల్ వార్డెన్లు,  సిబ్బంది పాల్గొన్నారు.