27 May, 2026 | 1:33 AM

వర్షంతో తడిసిన ధాన్యం

27-05-2026 12:38 AM

నిర్మల్ మే 26 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షం పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కుంటాల కుబీర్ బైంసా నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అర్ధ గంట సేపు వర్షం కురిసింది. దీంతో పంట కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న, వరి జొన్న పంటలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు . రాత్రి పూట వర్షం కురవడంతో రైతులు చెమ్మ చీకట్లో ఫోన్ లైట్లు సహకారంతో పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రభుత్వం పంట కొనుగోలను జాపేయి చేయడం వలన తమ పంటలు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన చెందారు వెంటనే పంటను కొనుగోలు చేసి తరలించాలని రైతులు డిమాండ్ చేశారు.