24 March, 2026 | 1:55 AM

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జనగణన చేయాలి

23-03-2026 10:04 PM

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

జనగణన 2027పై చార్జ్ ఆఫీసర్లకు సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జనగణన 2027 ను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జనగణన 2027 లో భాగంగా సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్, మొబైల్ యాప్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్, బ్లాక్స్ డిజిటల్ విధానంలో సిద్ధం చేయడం, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల  నియామకం తదితర అంశాలపై పై చార్జ్ సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణ కార్యక్రమం జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో సోమవారం ప్రారంభించారు.

కలెక్టర్ హాజరై మాట్లాడుతూ... రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనని వెల్లడించారు. మొదటి దశలో మే 11 వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027 లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని తెలిపారు.ప్రభుత్వ పథకాలను రూపకల్పనకు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జనగణన చాలా ఉపయోగప డుతుందని తెలిపారు.

ఆరోగ్య, అక్షరాస్యత, జనాభా, లింగ నిష్పత్తి, వలసలు, ఉపాధి నివాస స్థితి తదితర అంశాల వివరాలు జనగణనతో ప్రభుత్వం వద్ద ఉంటాయని వెల్లడించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు.శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.