21 April, 2026 | 3:35 AM

ఉట్నూర్ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే వెడ్మ

21-04-2026 02:04 AM

ఉట్నూర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఉట్నూర్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వివిధ పనులను చేపట్టడం జరుగుతోందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం, అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ప్రస్తుతం వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగిన, అభివృద్ధితో ఉట్నూర్ పట్టణం రూపురేఖలు మారుతాయని, అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అన్నారు. అలాగే ఆగ్నమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ రెసిస్టెన్స్ పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  ఉట్నూర్ సర్పంచ్ జాదో అనిత, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు,  ప్రజలు పాల్గొన్నారు.