బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ కు ఘన సన్మానం
14-04-2026 07:01 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): ఇటివలే ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో బ్రిలియంట్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించిన సందర్భంగా ఆ విద్యాసంస్థల చైర్మన్ బిఎన్ఆర్ ను సారపాక గ్రామ సర్పంచ్ శివరాం కిషోర్ నాయక్, ఉప సర్పంచ్ రమేష్ మంగళవారం ఘనంగా సన్మానించారు. స్టేట్ ర్యాంకులు సాధించిన పావని, బన్యశ్రీ, భవ్యశ్రీ లతో పాటు సారపాకకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఎంఈఓ యదుసింహారాజు, ఎస్ఐ మేడ ప్రసాద్, ఈవో మహేష్, పాలకమండలి సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






