3 April, 2026 | 4:21 AM

రాజా రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

03-04-2026 01:07 AM

వేలంలో దక్కించుకున్న పారిశ్రామిక వేత్త సైరస్ పూనావాలా

ముంబై, ఏప్రిల్ ౨: ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడుపో యి రికార్డు సృష్టించింది. బుధవారం ముం బైలో జరిగిన సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు పలువురు పోటీపడ్డారు. చివరకు పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ కళాఖండాన్ని దక్కించుకున్నారు. వర్మ 1890లలో గీసిన ఈ చిత్రాన్ని రూ.167కోట్లకు కొనుగోలు చేశా రు.

ఈ చిత్రంలో యశోద ఆవు పాలు పితుకుతుండగా, వెనుక నుంచి బాలకృష్ణుడు పాలపాత్రను అందుకోవడానికి చేయి చాస్తున్నట్లుగా చిత్రీకరించబడింది. కాగా గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడయ్యింది. అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా ఇప్పటివరకు ఇదే కొనసాగగా.. తాజాగా ఆ రికార్డును ఈ పెయింటింగ్ బద్దలు కొట్టింది. పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని, ఇది తన కర్తవ్యమని సైరస్ మీడియాతో అన్నారు.