టేకులపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు ఎక్స్ రోడ్డు వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన ప్రజాసేవను స్మరించుకున్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






