5 May, 2026 | 8:20 PM

Breaking News

హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •  

జవహర్‌నగర్‌లో యువతి అదృశ్యం

26-02-2026 12:00 AM

పీఎస్‌లో ఫిర్యాదు

జవహర్‌నగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): యువతి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజేఆర్ నగర్లో అడ్డుల నాగరాజు తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈనెల 24న తన పెద్ద కుమార్తె అడ్డుల శ్రీవల్లి (19) ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

శ్రీవల్లి ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. ఈ మేరకు ఆమె ఆచూకీ కోసం తెలిసిన చోట్ల వెతికినా బంధువుల వద్ద వెతికినా చుట్టుపక్కల వెతికినా ఆమె సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి నాగరాజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.