9 April, 2026 | 5:33 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

యువతి ఆత్మహత్య

05-10-2025 12:00 AM

మేడిపల్లి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రా జంపేట వాణి (54) కూతురు మాధురి (21)తో కలిసి చెంగిచెర్లలో నివాసం ఉంటున్నారు. భర్త మురళీకృష్ణ ఐదు సంవత్సరాల క్రితం గుండె సంబంధిత సమస్య తో చనిపోయారు.అప్పటి నుంచి మాధురి డిప్రెషన్ లోకి వెళ్ళింది. మానసిక సమస్య కారణంగా బీటెక్ రెండవ సంవత్సరం మధ్యలో ఆపేసి ఇంటి వద్ద ఉంటుంది.

మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బంజారాహిల్స్‌లో ఓ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. ఈనెల 2 తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మాధురి చనిపోయిందని  తల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.