పేద బిడ్డ పెళ్లికి ఉషోదయ సాయం
23-08-2026 07:34 PM
కొండపాక, ఆగష్టు 23:(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసీం చిన్న కుమార్తె పెళ్లికి స్థానిక ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆర్థిక సాయం అందించారు. సంఘ సభ్యులు రూ. 7,700 సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉషోదయ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఖాసీం ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గూడెం శంకర్, ఉపాధ్యక్షుడు తూర్పు గున్నాల సత్యం, ప్రధాన కార్యదర్శి కాసాని మహేందర్ రెడ్డి, కోశాధికారి గున్నాల కిషోర్, సభ్యులు పాల్గొన్నారు.






