ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
08-08-2026 03:33 PM
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పిలుపునిచ్చారు. శనివారం ఉట్నూర్ క్యాంప్ కార్యాలయంలో గిరిజన పెద్దలతో మాట్లాడుతూ.. సర్మేడీలు, రాయి సెంటర్ సభ్యులు, పటేల్ వ్యవస్థ, ఆదివాసీ విద్యార్థి యువజన సంఘాలు పాల్గొని ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.






