8 August, 2026 | 7:51 PM

అన్నం పరబ్రహ్మ స్వరూపం

08-08-2026 06:25 PM

తుమ్మ రాజ్ కుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రాజు జవంత్-రాధిక సిస్టర్  కూతురు అయిన డాక్టర్ కట్ట దీన ఒలివియా జ్యోతి పుట్టినరోజు సందర్భంగా శనివారం స్థానిక మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఈ దివ్యాంగులైన చిన్నారుల మధ్య నిర్వహించుకోవడం చాలా అదృష్టమని ప్రతి సంవత్సరం ఈ చిన్నారుల మధ్య నీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అందుకు ధన్యవాదాలు అని రానున్న రోజుల్లో మా యువ సంకల్ప ఫౌండేషన్ నిర్వహించే మెడికల్ క్యాంపులకు డాక్టర్ గా వ్యవహరించాలని కోరడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దేశెట్టి రమేష్.. సేంట ఇంచార్జ్ శ్రీనివాస్.. సిబ్బంది సరస్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.