8 August, 2026 | 7:50 PM

స్వర్గీయ కృష్ణారావు రాసిన పుస్తకావిష్కరణ

08-08-2026 06:27 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాస్తవ్యులు, ప్రముఖ రచయిత, వైద్యులు ఒ.వీ. నరసింహారావు, రంగనాయకమ్మ దంపతుల కుమారుడు కృష్ణారావు రాసిన ‘మిస్ అండ్ మిస్టర్' (వినోద, శృంగార, హాస్యభరిత) పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ నార్సింగి మంచిరేవుల 10 విల్లాస్ లోని నివాసంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి కృష్ణారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సీ.ఏల్.నర్సింహారావు, సుభాష్ చంద్ర, రమేష్, శిరీష్ రెడ్డి, సీతారాం చందర్ రావు, ఉమాశంకర్ రావు, శ్రీనివాసరావు, వేణుగోపాల్ రావు, అనిల్ కుమార్, సతీష్, కళ్యాణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.