8 August, 2026 | 6:48 PM

ఘనంగా బోనాల సంబరాలు

08-08-2026 03:32 PM

ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు, పోతురాజు వేషాలు

చేర్యాల, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనమైన బోనాల పండుగను శనివారం చేర్యాల పట్టణంలోని పంచతంత్ర పాఠశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల ఆధ్వర్యంలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తీసుకొని పాఠశాల నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు చప్పుళ్లు, పోతురాజు నృత్యాలతో పరిసర ప్రాంతం భక్తి శ్రద్ధలతో మారుమోగింది.విద్యార్థినులు, ఉపాధ్యాయులు స్థానిక మైసమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రిన్సిపాల్ శ్యామల మాట్లాడుతూ,చిన్నారుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, పోతురాజు వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి.