8 March, 2026 | 6:33 AM

వరల్డ్‌ కప్ మనదే

08-03-2026 01:36 AM

హైదరాబాద్‌లో ఫైనల్ ఫీవర్

హైదరాబాద్, మార్చి 7 : మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదు. క్రికెటర్లను అభిమానులు దాదాపు దేవుళ్లులా ఆరాధిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్ లోనూ విపరీతమైన క్రికెట్ క్రేజ్ ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ క్రికెట్ హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను మరోసారి గెలిచేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచిన నేపథ్యంలో నగర యువత అంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగనున్న ఫైనల్ ను వీక్షించేందుకు యూత్ అంతా తమ తమ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. శనివారం ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ గురించే చర్చ.. ఫైనల్లో న్యూజిలాండ్ ను భారత్ ఓడిస్తుందని, వరుసగా రెండో సారి ట్రోఫీ గెలవడం ఖాయమని నగర అభిమానులు పూర్తి ధీమాతో ఉన్నారు. 

ఫైనల్లో అభిషేక్ శర్మ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి మంచి స్పెల్ వేస్తాడనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టీమిండియా.

 - హర్షిణి ప్రియ, వర్థమాన క్రికెటర్

సొంతగడ్డపై ఆడుతుండడం మనకు అడ్వాంటేజ్. అహ్మదాబాద్ సెంటిమెంట్‌ను ఈ సారి టీమిండియా బ్రేక్ చేస్తుంది. బౌలింగ్ కొంచెం బెటర్‌గా చేస్తే చాలు ట్రోఫీ మనదే.

- షబ్బీర్, క్రికెట్ కోచ్

బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే భారీస్కోరు వస్తుంది. సూర్యకుమార్, తిలక్ వర్మ బాగా ఆడాలని కోరుకుంటున్నా. మళ్లీ వరల్డ్‌కప్ మనమే గెలుస్తాం.

-తరుణ్

అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ వరల్డ్‌కప్ గెలుస్తుంది.  ఫైనల్లో మన తిలక్‌వర్మ బాగా ఆడాలి. ఆల్‌ది బెస్ట్ టీమిండియా

-శ్రీవిద్య