4 March, 2026 | 7:21 PM

గనిలో స్పృహ తప్పి పడిపోయిన కార్మికుడు

04-03-2026 05:38 PM

- గనిలో గాలి సరఫరా లేదు

- పట్టించుకొని వెంటిలేషన్ అధికారి

- గనిలో కార్మికుల ప్రాణాలకు ముప్పు 

- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి బొగ్గు బావుల్లో ఊపిరాడని పరిస్థితి కార్మికుల ప్రాణాలకు పెనుముప్పుగా మారింది. భూగర్భగనిలో కనీస గాలి సప్లై చర్యలపై అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకు నిదర్శనంగా శాంతిఖనిలో మొదటి షిఫ్టులో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఊపిరాడక కింద పడిపోయి నా సంఘటన ఉదాహరణగా పేర్కొనవచ్చు. అధికారుల పర్యవేక్షణ భూగర్భగనుల్లో కనీస సదుపాయాలు లేక కార్మికులు నిత్యం నరకయాతన పడుతున్నారు.

గాలి, నీరు వంటి ప్రధాన వసతులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, స్థానిక అధికారుల నిర్లక్ష్యం వెరసి గనుల్లో కార్మికుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. శాంతిఖని గని లో47 లెవెల్ లో బుధవారం సపోర్ట్ పనులు చేస్తున్న అన్వేష్ అనే బదిలీ కార్మికుడు ఊపిరి అడక స్పృహ తప్పాడు. అతనితో పని చేస్తున్న తోటి కార్మికులు వెంటనే కానీ ఉపరాతలానికి తీసుకొచ్చారు.

పని స్థలాల్లో ముందస్తుగా స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు. కానీ ఆ కార్మికుడు పనిచేస్తున్న పని స్థలంలో అటువంటి సదుపాయం లేదు. సంఘటన తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వడంతో తెచ్చ్కర్ ను పంపించారు. అప్పటివరకూ అక్కడే కార్మికుడు ఉండిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన కార్మికుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అధికారుల పర్యవేక్షణ లోపం..

భూగర్భగనుల్లో రక్షణ, గాలి తాగునీటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ఈ పని స్థలాల్లో కార్మికులకు మౌలిక వసతులు కల్పించడం అధికారుల బాధ్యత. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలి. ఇలా జరిగినప్పుడే కార్మిక ప్రాణాలకు భద్రత ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ సాఫీగా సాగుతుంది. గనుల్లో కనీస సదుపాయాలు లేకపోయినా కార్మికుల తోటి అధికారులు పనులు చేపించడం సింగరేణిలో పరిపాటిగా మారింది. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తిని తీయాలని చూడటం అధికారులకు అలవాటుగా మారింది.

ఈ నేపథ్యంలోనే భూగర్భగనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఊపిరాడని, రక్షణ లేని తీవ్ర వేడి వాతావరణం లో పని స్థలాలు కూరుకుపోయాయి. ఈ పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం వల్లనే నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. రక్షణ గాలి తాగునీరు సక్రమంగా పని స్థలాల్లో సమకూర్చడం అధికారుల విధుల ప్రధాన లక్ష్యం గా సాగించాలి.

కానీ గనిలో ఓ కార్మికుడు ఊపిరాడని పరిస్థితి లో పనిచేస్తూ స్పృహ కోల్పోవడం అధికారులు, ప్రధానంగా వెంటిలేషన్ అధికారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుంది. పని స్థలాలు నరక కూపంగా తలపిస్తున్నాయి. కార్మికులు ప్రతిరోజు గాలి నీరు రక్షణ వంటి ప్రధాన చర్యలపై సంబంధిత అధికారులకు గుర్తు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ అధికారులు విడిచి ఏమైనా పెట్టడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల బాధ్యతరహిత్యం కార్మికుల ప్రాణాలకు మప్పుగా మారాయి. కార్మికుల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చచ్చు పడిన సంఘాలు..

భూగర్భగనుల్లో తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తికి కృషి చేస్తున్న కార్మికుల పట్ల కార్మిక సంఘాలకు ఏమాత్రం బాధ్యత లేకుండా పోయింది. గని పని స్థలాల్లో కనీస సౌకర్యాలు లేకున్నా పట్టించుకోవడం తమ పని కాదన్నట్టు కార్మిక సంఘాలు వ్యవహరిస్తున్నాయి. కార్మిక సంఘాలు సరిగా పనిచేస్తే గనుల్లో సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఒకవైపు, కార్మిక సంఘాలు మరోవైపు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అస్సలూ పట్టించుకోవడం లేదు.

ఇరుపక్షాలకు కార్మికులన్నా.. బొగ్గు ఉత్పత్తి లక్ష మన్నా ఏమాత్రం పట్టింపు లేదు. కార్మికులు భద్రంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాఫీగా సాగుతుంది. తద్వారా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు దాటుతాయి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం అటు అధికారుల్లో, ఇటు కార్మిక సంఘాల్లో లేక కాదు. నిర్లక్ష్యమే అందుకు కారణం. ఎవరేమైతే మాకేంది అనే  నిర్లక్ష్యపు ధోరణిలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా భూగర్భ గనుల్లో రక్షణ,తాగునీరు, గాలి సప్లై వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం యజమాన్యం కనీస బాధ్యతగా గుర్తించాలి. గనుల్లో పర్యవేక్షణకు తిలోదొకలిచిస్తున్న అధికారులపై చర్యలు ఉంటే అన్ని చక్కబడుతాయని కార్మికులు భావిస్తున్నారు.