10 March, 2026 | 11:04 AM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

08-03-2026 04:53 PM

సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సామాజికవేత్త,  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవరకొండ పట్టణంలో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. దేవరకొండ నియోజకవర్గంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న, సామాజిక సేవ దృక్పథం కలిగిన మహిళ ప్రముఖులను గుర్తించి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో సేవ చేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ, సమాజంలో అగ్రగామిగా ఉంటూ చాలా మంది మహిళలను చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి సంధ్య రెడ్డి, పుణుగురి లింగయ్య, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేశ్, చేరిపల్లి జయలక్ష్మి, పెరికేటి శ్రీనివాస చారి, పున్న బిక్షమయ్య, భీమగోని శివ గౌడ్, వనం చంద్రకళ, బీసీ హాస్టల్ వార్డెన్ (బాలికలు) రేణుక, డాక్టర్ విజయ, డాక్టర్ శశికళ, డాక్టర్ రుణాదేవి, శిరీష, సావిత్రి, ఎం.ఏ ఖాలిక్, శిగ శ్రీనివాస్, మహిళలు విద్యార్థినులు పాల్గొన్నారు.