25 February, 2026 | 3:39 AM

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

25-02-2026 12:18 AM

మోతె, ఫిబ్రవరి 24: మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మహిళ శక్తి భవనం గ్రామ సర్పంచ్ అనురాధతో కలిసి  ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా, తీసుకున్న కార్యక్రమం కోటి మంది మహిళలను కోటేశ్వరులను, చేయడం లక్ష్యం గా ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల తో, మహిళా సంఘాల భవనం నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి. అనురాధ, ఉపసర్పంచ్ ఉపేందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న, సోషల్ మీడియా మండల అధ్యక్షులు గణేష్, వార్డ్ సభ్యులు యశోద, తరుణ్, మహిళసంఘాల సభ్యులు మంగమ్మ, రజిత, పద్మ, మల్లేశ్వరి, పెద్ద వెంకట్ రెడ్డి, వీరారెడ్డి, గుత్తేదారు రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశం, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.