13 March, 2026 | 11:07 PM

సమాజ నిర్మాణంలో మహిళలే మార్గదర్శకులు

13-03-2026 09:56 PM

జవహర్ నగర్ మెస్మా టిఐఎఫ్ శోభా రెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాజ నిర్మాణంలో మహిళలే మార్గదర్శకులుగా నిలుస్తున్నారని జవహర్ నగర్ మెస్మా టిఐఎఫ్ శోభా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ డ్వాక్రా భవన్లో శుక్రవారం జవహర్ నగర్ మెస్మా టిఐఎఫ్ శోభా రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెస్మా అధికారి నిరూపమ, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శోభా రెడ్డి మాట్లాడుతూ... చదువుతూనే దేశ భవిష్యత్తు మారుతుందని ప్రతి ఒక్కరు విద్యనుభ్యసించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎస్సై మౌనిక, మెస్మా సిబ్బంది, జవహర్ నగర్ మహిళా పోలీసులు, స్థానికులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.