calender_icon.png 20 February, 2026 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ అదృశ్యం

20-02-2026 01:38:36 AM

నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు ముమ్మరం 

నిజామాబాద్ ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ నివాసి అయిన శ్రీమతి సామలచందన ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆటోలో బయలుదేరారు.  ఆటోలో బయలుదేరిన చందన ఆచూకీ రాత్రి వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో కూడా విచారించారు. ఇది ఇలా ఉండగా చందన ఒంటిపై దాదాపుగా 14 తులాల బంగారు నగలు ఉన్నట్టుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది నీలిరంగు నైటీతో వెళ్లి నట్టు వారు తెలిపారు. 

ఆమె అచూకీ  కై బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబ సభ్యులు చివరికి నగర నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చందన ఆరోగ్య విషయమై గత కొద్ది రోజులుగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉదయం చందన నడుచుకుంటూ వెళ్లి ఆటోలో ఎక్కిన దృశ్యాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ విషయమై జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆటోను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పలు రహదారులను క్షుణ్ణంగా పరిశీలించి చందన ఆటోలో ప్రయాణించినట్టుగా గుర్తించారు