16 March, 2026 | 3:49 AM

క్రీడలలో గెలుపు ఓటములు సహజం

16-03-2026 01:01 AM

మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్, మార్చి 15 (విజయక్రాంతి): క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన బాధ పడవద్దు అని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రాంపల్లి దయారాలోని కింగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన సీఎంఆర్ కప్ క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన ఓడిపోయిన వారు మరింత ఉత్సాహంతో వచ్చే టోర్నీలో గెలుపొందడానికి ప్రయత్నించాలన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నీలో వప్పుగూడ ఎంకే లెవెన్ జట్టు విన్నర్ గా నిలిచింది. ఈ జట్టుకు ట్రోఫీ, లక్ష రూపాయల చెక్కును మల్లారెడ్డి అందజేశారు. కీసర రుద్ర టీం రన్నర్‌గా నిలిచింది. ఈ జట్టు కు రూ.50 వేల చెక్కును అందజేశారు. టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లను ఆయన అభినందించారు.