సమం చేస్తారా ?
- ఇంగ్లాండ్‌తో మూడో టీ20
- సంజూకు మళ్లీ నిరాశే
- బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్
ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ పరాజయం.. వెరసి తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. తుది జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ ఇవ్వనుండగా సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే మిగలనుంది.
నాటింగ్‌హామ్, జూలై 6 : భారత్, ఇం గ్లాండ్ మధ్య మరో రసవత్తర సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మంగళవారం నా టింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20 జరగబోతోంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవగా, రెండో టీ20లో ఇంగ్లాం డ్ గెలిచింది. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ట్రెంట్ బ్రిడ్జిలో భారత్ దుమ్మురేపాల్సిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ 1- ఆధి క్యంలో ఉండగా ఇది కూడా ఓడితే సిరీస్ గెలిచే అవకాశం భారత్ కు ఉండదు.
తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సిరీస్ సమం అవుతుంది. గత మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమే. ఆరంభంలో అదరగొట్టిన భారత బౌలర్ల తర్వాత చేతులెత్తేశారు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో తడబడ్డారు. రవి బిష్ణోయ్ ఒక ఓవర్లో 29 పరుగులు ఇవ్వడం ఓటమికి కారణమైంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుకు సంబంధించి ఒక మార్పు చోటు చేసుకోనుంది. రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకి రానున్నాడు.
యార్కర్ల స్పెషలిస్టుగా గు ర్తింపున్న ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్‌లో కీల కం కానున్నాడు. నాటింగ్ హామ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ టంతో పాటు ఇక్కడి చల్లని వా తావరణం, ఉదయం పూట ఉం డే తేమ వల్ల ఆరంభంలో పేసర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. దీంతో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. రెండో టీ20 మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీసి రాణించినప్పటికీ..హర్షిత్ రాణా కొత్త బం తితో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయాడు.
మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. చిచ్చర పిడుగు వైభ వ్ సూర్యవంశీని కొనసాగించనుండడంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. భారత బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఫా మ్‌లో ఉన్నారు. శివమ్ దూబే ఫినిషర్ రోల్‌కు ఇంకా న్యాయం చేయాల్సి ఉంది.
ఇటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా పెద్ద ఇన్నింగ్సే బాకీ ఉన్నాడు. అటు బౌలింగ్‌లో అర్షదీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్ లో ఉండగా.. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిపై అంచనాలున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం తుది జట్టు లో ఎలాంటి మా ర్పులు చేయలేదు. రెండో టీ20 ఆడిన ఫై నల్ ఎలెవెన్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు ప్రక టించింది. ఇదిలా ఉంటే ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామంగా నిలుస్తుంది. 14 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు గెలిచాయి.
తుది జట్ల అంచనా
భారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటే ల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాద వ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ : సాల్ట్, బట్లర్, బ్రూక్ (కెప్టెన్), బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, ఆర్చర్, అదిల్ రషీ ద్, జోస్ టంగ్






