ఎట్టకేలకు సర్వే షురూ!
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు వెలుగుచూసేనా?
అక్రమార్కుల్లో మొదలైన గుబులు
మంత్రి పొంగులేటి మాట అమలయ్యేనా?
భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (విజయక్రాంతి): అంగుళం ప్రభుత్వ భూమి సైతం ఆక్రమణకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సర్వే నంబర్లలో సర్వే నిర్వహించి ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదేపదే ఇచ్చిన హామీ ఎట్టకేలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రభుత్వ సర్వే నెంబర్లు 999, 444,817,727 లలో ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వేకు శ్రీకారం చుట్టుంది. గతంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా సర్వే నెంబర్లలో సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించిన ప్రభుత్వం, తాజాగా ఏ నెల 18వ తేదీ నుంచి ఎంజాయ్మెంట్ సర్వేకు సిద్ధమైంది. జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న 8మంది సర్వేయర్లతో ఇతర సిబ్బంది తో కలిపి 20 మంది ని 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టింది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ, అసైన్మెంట్ ఎండోమెంట్ భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఆక్రమణలు చోటు చేసుకోవడం విధితమే. తప్పుడు సర్వే నెంబర్ల ద్వారా హక్కులు పొందడం జరిగింది. ఏకంగా అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్ లో నిర్మాణాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అధికారులకు అక్రమార్కులు ఏటీఎంలుగా మారాయని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు. కొత్తగూడెం డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పర్యవేక్షణలో సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ సర్వే ద్వారా ఎంత భూమి ఆక్రమణకు గురైందో తేటతెల్లమవుతుంది. సర్వేతో సరిపెట్టుకోకుండా సర్వే వివరాలు హద్దులతో కూడిన మ్యాప్ ను ఆన్లైన్లో పొందపరిచి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచినప్పుడే ప్రభుత్వ భూమి పరిరక్షణ చర్యకు సార్ధకత దక్కుతుందని కొందరు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ గురైన ప్రభుత్వ భూమిని రికవరీ చేస్తారా, వారికే రెగ్యులరైజ్ చేస్తారా అనే అంశం ప్రతి ఒక్కరిలో సందేహాలకు దారితీస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏ మేరకు ఫలితాలను చూపనుందో వేచి చూడాలి.
817లో 2,361.37 ఎకరాల భూమి
పాల్వంచలోని 817 సర్వే నంబర్లు మొత్తం 2,361.37 ఎకరాల భూమి ఉంది. 107 ఎకరాలు పట్టా భూమిగా, 1,750 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ భూమి, మిగిలిన ది ప్రభుత్వ, ఎస్త్స్రన్మెంట్ భూమిగా 2025లో సమాజచార హక్కు ద్వారా రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇచ్చిన లెక్కలు చెబుతున్నాయి. చట్టం ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ లో, అసైన్మెంట్, ప్రభుత్వ భూముల్లో ఎలాంటి భూ బదలాయింపులు చేయరాదని స్పష్టంగా ఉంది. ఈ సర్వే ద్వారా వాస్తవాలు వలువు చూసినా .
సర్వే నంబర్ 444 లో 853.39 ఎకరాల భూమి
సర్వే నంబర్ 444 లో మొత్తం 853.39 ఎకరాల భూమి ఉంది. రెండు వందల నలభై ఐదు ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా, మిగిలిన భూమి ఎస్ అండ్ భూమిగా అధికారులు అధికారికంగా లెక్కలు చూపారు.
రెవెన్యూ అధికారుల లాపర్వ ద్వారా ఈ సర్వే నంబర్లు ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన పట్టాదారుల పేర్లను నేటికీ పహానిల్లో పదిలంగా ఉంచడంతో అక్రమార్కులకు వారి సర్వే నెంబర్లు ఆక్రమణకు సులభతరం చేసినయ్. వాటి ఆధారంగానే ప్రభుత్వ భూమీ, ఎస్త్స్రన్మెంట్ భూముల్లో అక్కడ మార్కులు పాగా వేస్తున్నారు. ఓ ప్రైవేటు పరిశ్రమ యజమాని సైతం పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమిని ఆమూరు కొన్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నేడు చేపట్టిన ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా నిజాలు నెగ్గు తేలేనా.
727 సర్వే నంబర్లు 1,314.19 ఎకరాలు
727 సర్వే నంబర్లు మొత్తం 1,314 .19 ఎకరాల భూమి ఉంది. వాటిలో 465.38 ఎకరాల భూమిని ఎస్త్స్రన్డ్ చేయటం జరిగింది. ప్రభుత్వ భూమి గా అధికారిక లెక్కల్లో ఉంది. ఇట్టి భూమిలో కొందరు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి భూ బదలాయింపులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
999లో.4129.69 ఎకరాల భూమి.
ప్రభుత్వ సర్వే నెంబర్ 999 లో మొత్తం 4,129 .69 ఎకరాల భూమి ఉంది. వాటిలో 863.23. ఎకరాల భూమిని ఎస్ అండ్ చేయడం జరిగింది. మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా అధికారిక లెక్కగా తెలుపుతుంది.






