28 July, 2026 | 1:29 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

కేంద్రాన్ని కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు

09-06-2026 01:45 AM

ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్  

హైదరాబాద్, జూన్ ౮ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పైన నమోదైన పీఎఫ్ కేసు ఏమైందీ..? విచారణ ఎందుకు జరడం లేదని దయాకర్ ప్రశ్నించారు.

సోమవారం అద్దంకి దయాకర్ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆస్పత్రుల వ్యవహారంపైన, హరీశ్‌రావుపైన కూడా సీబీఐ విచారణ జరిగిందని, దానిపైన బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొంగనాటకమాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నాయన్నారు. సింగరేణిపైన హరీశ్‌రావు అబ ద్ధాలు చెపుతున్నాడని విమర్శించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో యూరియా కొరత ను సృష్టిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబానికి అధికారం కోసం వెపర్లాట తప్ప మరొకటి లేదన్నారు.