7 May, 2026 | 2:07 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

మురుగు కనుమరుగయ్యేదెప్పుడు?

09-02-2026 12:55 AM

వర్షాకాలం పోయి మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు ఇదేస్థితి

జవహర్ నగర్ ,ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) :  హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్లో గల పాపయ్య నగర్ కాలనీలో మురుగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందులకు ఆవాసంగా మురుగుతో, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.పాపయ్య నగర్ కు వెళ్ళేదారిలో వెళ్ళాలంటే ముక్కు మూయాల్సిందే, మురుగుతో ఈగలు, దో మల వల్ల  ఆసుపత్రుల పాలు కావాల్సిందేనా!! వానాకాలంముగిసిన ... మురుగు నీటితో పందులు, దోమలు, ఈగలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. అటు వైపు వెళ్ళాలంటే ముక్కుమూసుకొని పోవాల్సిందే.

పాపయ్యనగర్  వెళ్ళే దారిలో మురుగు నీరు స్థలంలో చెరువును తలపిస్తుంది. కలుషితమైన రసాయానాలుగా తయారై ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కాలనీల ప్రజలు దుర్వాసను భరించలేక రోగాల పాలవుతున్నారు.

పనుల కోసం పట్టణాలకు వెళ్ళే ప్రజలు నిత్యం వేలాది మంది ఈ రోడ్డు వెంబడే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. దుర్వాసనకు భరించలేక ముక్కుమూసుకునే పోతుంటే ఊపిరాగి నంత పని అవుతుంది. వానాకాలం ముగిసిన పట్టింపేది ? వానాకాలం ముగిసిన మురుగు నీటిని పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. వ్యాధు లు సంభవించకముందే మేల్కొంటే మేలని ప్రజలు వేడుకుంటున్నారు.