15 April, 2026 | 2:38 AM

సుందరీకరణ మురికి సంగతి?

15-04-2026 12:00 AM

మూడు చెరువులకురూ.5.82 కోట్లు 

కరీంనగర్, ఏప్రిల్14 (విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, కొత్తపల్లిలోని చెరువుల సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈనెల నాలుగో వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయా పనులను ప్రారంభించనున్నారు. ఆయా చెరువుల సుందరీకరణ, పను ల పటిష్టీకరణ, రక్షణ, నీటి నిర్వహణ కోసం మొత్తం రూ.5.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమ్రుత్ 2.0 లో భాగంగా కేం ద్రం ఈ నిధులను విడుదల చేసింది.

టెండర్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. అంతా బాగానే ఉంది కొత్తపల్లి చెరువు లోకి డ్రైనేజీ వచ్చి చేరుతుండటంతో నీరు కలుషిత మవుతుం ది. చెరువు చుట్టూ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొత్తపల్లి ఊర చెరువు అభివృద్ధికి రూ.2.86 కోట్లు మంజూరయ్యా యి. ఆయా నిధులతో చెరువు కట్ట బలోపేతం, రక్షణ చర్యలు, అందంగా తీర్చిదిద్దే ప నులతోపాటు కాలుష్య నివారణ చర్యలు చేపడతారు.

ఈ పనుల కోసం సుమారు రూ.2.25 కోట్ల వ్యయం అంచనా వేయగా, అదనంగా పన్నులు, సెస్సులు, కన్సల్టెన్సీ, ఇతర ఖర్చులతో మొత్తం వ్యయం రూ.2.86 కోట్లకు చేరుకుంది.అయితే డ్రైనేజీ నీరు చెరువులోకి పోకుండా చేయకుంటే కలుషిత నివారణ సాధ్యం కాదు.కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి మాల కుంట చెరువుల పునరుద్ధరణ పనుల కోసం రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులో భా గం గా చెరువు బండ్ను బలోపేతం చేయడం, స్టోన్ పిచింగ్, ఫిల్టర్ మీడియా, డ్రైనేజ్ వ్యవస్థల ఏర్పాట్లు చేయనున్నారు.

అదనంగా బ్ంప ఎంఎస్ రైలింగ్, చెరువు పరిసరాల్లో చైన్ లింక్ మెష్ ఏర్పాటు వంటి రక్షణ చర్యలు చేపడతారు. అలాగే సుందరీకరణ చర్యల్లో భాగంగా చెరువు చుట్టూ పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పనులకు సుమారు రూ. 85.35 లక్షలు కేటాయించారు. ఇక ఇతర ఖర్చుల కింద సీజ్ని యరేజ్ ఛార్జీలు, జీఎస్టీ, కన్సల్టెన్సీ ఫీజులు, ప్లాంట్ల కొనుగోలు, కాలుష్య నివారణ చర్య లు, అనివార్య ఖర్చులు కలిపి మరో 24. 64 లక్షలు కేటాయించారు.

మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం 1.10 కోట్లుగా నిర్ణయించబడింది. పనులు పూర్తయిన తర్వాత చెరు వు అందంగా మారడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది.కరీంనగర్లోని రేకుర్తి పెంటకమ్మ చెరువు అభివృద్ధికి సైతంపై పనుల కోసం రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంపు చర్యలు తీసుకో నున్నారు. నీటి నిల్వను కాపాడేందుకు ఆర్సీసీ ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. మొత్తం పనుల ఖర్చు సుమారు రూ. 1.36 కోట్లుగా ఉండగా, సీజ్నియరేజ్, జీఎస్టీ, కన్సల్టెన్సీ ఛార్జీలు, ఇతర అనుబంధ వ్య యాలు కలిపి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1.80 కోట్లకు చేరింది. 

ఆందోళన కలిగిస్తున్న అంశం

పొలాలు, డ్రైనేజీల నుంచి విష రసాయనాలు చెత్తాచెదారం వచ్చి చేరుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.. చెరువు కట్టలే డంప్ యార్డులుగా మారుయున్నాయి

ఒకప్పటి తాగునీటి వనరులు.. ఇప్పుడు కాలుష్య కాసారాలు

ఆ చెరువుల్లోని చేపలు తింటే లంగ్స్, కిడ్నీలపై ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మానవ, పారిశ్రామిక వ్యర్థాలు, పంట పొలాల్లోంచి వచ్చే విష రసాయనాలు కలవడం వల్ల చెరువుల్లో ఆక్సిజన్‌స్థాయిలు తగ్గిపోయి అరుదైన చేపలు అంతరిస్తున్నాయని మత్స్యశాఖ చెప్తోంది. సుందరీకరణ సమయంలో వీటిని పరిగబలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.