calender_icon.png 4 February, 2026 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసానిని సనత్‌నగర్‌లో అడ్డుకుంటాం

04-02-2026 12:25:01 AM

సనత్‌నగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి):- సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ముమ్మాటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందేనని అమీర్ పేట్, SR నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. క్షమాపణ చెపితేనే తలసానిని సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగనిస్తామని హెచ్చరించారు. ఈ క్రమం లో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ బాధ పడిందని పేర్కొన్నారు. ప్రజల విరాళాలను తన విరాళాలుగా చెప్పుకునే తలసాని స్థాయి మరచి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అమీర్ పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్‌ఎస్ రావు, మహిళా ప్రెసిడెంట్ రాజేశ్వరి, నవీన్ రాజ్, రవికిరణ్, శ్రీకాంత్ యాదవ్, ప్రతాప్ నాయక్, పద్మావతి, అమృత, సత్యనారాయణ యాదవ్, రమేష్ ,రాకేష్, సాయి గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.