31 March, 2026 | 2:52 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

అసైన్డ్ భూములను పరిరక్షిస్తాం

31-03-2026 01:16 AM
  1. రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ ప్రీతం
  2. యాజమాన్య హక్కులకు ప్రభుత్వం కృషి

ముషీరాబాద్, మార్చి30(విజయక్రాంతి):  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను పరిరక్షిస్తూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. ఈ అంశాన్ని రైతు కమీషన్ క్షుణంగా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి సమ స్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంద ని అన్నారు.

తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన భూ హక్కు సాధన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల ఎకరాలకు పైగా భూమి పంపిణీ జరిగిందని, తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేల ఎకరాల భూములను వెనక్కు తీసుకుందని ఆరోపించారు. ధరణి పేరిట 50 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగిందని, దీనికి సంబంధించిన వివరాలను సిఎం రేవంత్ రెడ్డికి అందజేశామని, త్వరలో భూ భకాసురులను నడిరోడ్డుమీదకు తీసుకువస్తామని హెచ్చరించారు. 

భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, సలహాదారు రాపోలు రాములు, రేగుంట నునీల్, డా.పేరుమాండ్ల రామకృష్ణ, డా.నండ్రు నరసింహా, మూసి శంకరన్న, జీవనజ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ప్రభు త్వాలు పంపిణీ చేసిన అన్ని రకాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించాల న్నారు. భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రంలో అసైన్డ్ భూముల కమీషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.