31 March, 2026 | 3:18 PM

Breaking News

రవీంద్ర భారతి హై స్కూల్‌లో ప్రత్యేక సర్టిఫికెట్‌ల పంపిణీ కార్యక్రమం   •   అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన   •   ఇస్ఫాహాన్‌లో భీకర పేలుళ్లు! ఇరాన్ రహస్య నిలయంపై అమెరికా బాంబుల వర్షం   •   రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి   •   గ్రంథాలయానికి పుస్తకాల విరాళం   •   బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •  

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన

31-03-2026 01:14 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం లోని గిర్నీతండా గ్రామపంచాయతీలో పిట్లం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినారు  చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పశు శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడం, పశువుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకుని, ఉచితంగా మందులు పొందారు.

పశువులకు వచ్చే వివిధ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడంతో పాటు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు రైతులకు అవగాహన కల్పించారు.. కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సవాయి సింగ్, గిర్నీతండా సర్పంచ్ మారోని బాయి, సింగితం సర్పంచ్ రఫీ, నాయకులు ఆకాష్, జగమాల్,  రాజు, సంతోష్ రాథోడ్, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, బలరాం, కార్యదర్శి శ్రీకాంత్, సూపర్వైజర్ నాగరాజు, డాక్టర్ సయ్యద్ యూనిస్, గోపాల మిత్ర నందు, సిద్దు, రఘు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.