23 June, 2026 | 3:59 AM

అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే సహించేది లేదు

23-06-2026 01:11 AM

గరిడేపల్లి, జూన్ 22: మండల కేంద్రమైన గరిడేపల్లి లోని కల్మలచెరువు రోడ్డులో ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే సహించేది లేదని గరిడేపల్లి జై భీమ్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి ఎంఆర్పిఎస్, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు ఇంజమూరి మల్లయ్య తెలిపారు.

సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా కల్మలచెరువు రోడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొంతమంది కావాలని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే ఎంతటి ఉద్యమానికైనా త్యాగానికైనా సిద్ధమని వారు పేర్కొన్నారు. ఒక వ్యక్తి అధికారులకు తప్పుడు సమాచారం అందించి, కావాలని కోర్టుకు తప్పుడు సంకేతాలు పంపి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ అధికార బలం అండబలంతో ప్రతిసారి విగ్రహం ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశీలన చేసి అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎంఎస్పి ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య, ఎం ఆర్ పి ఎస్ గరిడేపల్లి మండల కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, పోతుగంటి మధు, నకిరేకంటి రవి, పెట్ట వెంకటేష్, నందిపాటి రవీందర్, బచ్చలకూరి నాగార్జున, ఆలంపల్లి శేఖర్, పిట్ట నాగార్జున, పిట్ట నరసయ్య, మచ్చ విష్ణు, మాతంగి నరసింహ తదితరులు పాల్గొన్నారు.