అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తారా లేక పేదలచే ఆక్రమించమంటారా?
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, జూన్ 22 (విజయ క్రాంతి): గత ప్రభుత్వ హయాంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంచుతారా లేక సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రశ్నించారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు లేక అద్దె ఇండ్లల్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని రోజువారీ కూలీ పనులు చేసుకొని,చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని చాలీ చాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటు, ఇంటి అద్దె కట్టలేక, ఆర్థికంగా ఏమీ లేని కుటుంబాలు కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తదా లేక సిపిఐ ఆధ్వర్యంలో పేదలచే ఆ డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించమంటారా ప్రభుత్వం తేల్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అనంతరం ఆర్డి.ఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సిపిఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ.భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్, తదితరులు పాల్గొన్నారు.






