23 June, 2026 | 3:42 AM

16 ప్రైవేట్ ట్రావెల్స్ సీజ్

23-06-2026 01:44 AM

నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవే టు ట్రావెల్స్ పై సోమవారం కొరడా జలిపించారు. జిల్లా కేంద్రంగా ప్రతిరోజు ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాలపై ఫిర్యాదు రావడంతో డిటిఓ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రవాణా శాఖ సిబ్బంది ధూప్ సింగ్ తిరుపతి అక్షయ్ రజినీకాంత్ తదితరులు బైంసా నిర్మల్ హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అధికలోడు నిబంధనలు అతిక్రమించిన ప్రైవేట్ ట్రావెల్స్ లను 16 పట్టు కొని వాటిపై కేసు నమోదు చేసినట్టు రవా ణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది లిఖిత్ కైలాస్ వికాస్ కార్తీక్ ప్రమోద్ నితిన్ తేజ ఉన్నారు