ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం
15-07-2026 08:18 PM
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో 15వ వార్డులోని బస్టాండ్ వెనకాల మున్సిపల్ వాటర్ (మంచినీరు) డ్రైనేజ్ నీళ్లతో కలుషితమై వస్తునందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల రవీందర్ తో కలిసి పైప్లైన్ వేరే సైడు వేయాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కి, సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ బుధవారం సూచించారు. 15వ వార్డ్ లోని అపార్ట్మెంట్ దగ్గర జెసిబితో కచ్చా కాలువలు తీయించడం జరిగినది, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వర ప్రదీప్, వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






