15 July, 2026 | 8:34 PM

డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా తొలగించాలి

15-07-2026 08:08 PM

ఈనెల 26న జరిగే మేధావుల సదస్సును విజయవంతం చేయండి

డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్:షేక్షావలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా తొలగించాలని, ఈ నెల 26న నిర్వహించనున్న మేధావుల సదస్సును విజయవంతం చేయాలని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక్ నగర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఖండిస్తూ, డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.