15 July, 2026 | 8:39 PM

నంగునూరు మార్కెట్ కమిటీలో విభేదాలు

15-07-2026 08:15 PM

సమావేశం నుంచి వాకౌట్ చేసిన వైస్ చైర్మన్, డైరెక్టర్లు

నంగునూరు: నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది.చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని డైరెక్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎటువంటి తీర్మానాలు చర్చించకుండానే పత్రాలపై సంతకాలు చేయాలని చైర్మన్ ఒత్తిడి తేవడంతో వివాదం మొదలైంది. మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, రైతులకు అందజేయాల్సిన సేవల విషయంలో చైర్మన్ తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.

దీనిని వైస్ చైర్మన్,12 మంది డైరెక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.నిబంధనల ప్రకారం తీర్మానాలపై చర్చ జరగాలని,పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో చైర్మన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ,వారంతా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.గత కొద్ది రోజులుగా కార్యాలయ తాళం విషయంలోనూ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డైరెక్టర్లు ఆరోపించారు.