calender_icon.png 8 February, 2026 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

08-02-2026 07:18:04 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రజల ఆశీర్వాదంతో చిట్యాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 01, 06 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐఎం అభ్యర్థి జిట్టా నాగేశ్, కాంగ్రెస్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణ విజయానికి మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ... వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దశలవారీగా పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి, ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తామని తెలిపారు.

డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని, అలాగే అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను చేపట్టి, వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని, ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల ఆశీర్వాదంతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.

10వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కమ్మంపాటి సతీష్, టిడిపి నాయకుడు అర్రూరి సత్తయ్య , వంగూరి నవీన్ తమ తమ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, వనమా వెంకటేశ్వర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.