26 August, 2026 | 9:53 AM

మొక్కలు నాటి వాతావరణ పరిరక్షణకు ముందు ఉండాలి

26-08-2026 08:53 AM

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్

బోథ్,(విజయక్రాంతి): మొక్కలు నాటి వాతావరణన్ని పరిరక్షిస్తేనే భావితరాలకు మనం న్యాయం చేసిన వారం అవుతామని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఆయన పుట్టి పెరిగిన స్వగ్రామంలో ఉన్న పాఠశాలలో మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు అడవుల పరిరక్షణతో పాటు చెట్లు పెంపకం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మారుతున్న వాతావరణం మార్పుల వల్ల జరుగుతున్న సంఘటనలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నాకర్ రావు తో పాటు గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.